No Products in the Cart
ఒకరు నాకు చిన్నప్పుడు పాలిచ్చారు. ఆమె నా తల్లి. మరొకరు జీవితాంతం పాలిచ్చారు. ఇప్పుడు ఆ గోమాతను గొంతు కోస్తున్నారు!
ప్రజలు ఆమెను చంపేశారు. నైతికత ఆమెను చంపేసింది. మతాలు ఓడిపోయాయి. అమ్మలకే అమ్మ ఈరోజున అసహాయ స్థితిలో వధశాల నేల పై పడి ఉంది. తెగిన గొంతుక నుంచి రక్తం పొంగింది. చర్మం వలిచేశారు. కళ్ళ వెంబడి కన్నీళ్ళు ఎండిపోయాయి, చివరకు స్పృహ కూడా. మనుష జాతి యొక్క జీవం, పౌష్టికాహారం, కూడు, ప్రేమలకి మూల కారణం అయిన గోమాత ఈనాడు చచ్చిపోతోంది. ఓ ప్రపంచమా బతికే ఉన్నావా?
ఈ పుస్తకం తన తల్లి కోసం ఒక మనిషి చేస్తోన్న పోరాటం. గోమాత. ఈ పుస్తకం కసాయి మనుషుల అబద్దాలను, గోమాంస ప్రియుల హింసాత్మక మూలాలను నాశనం చేస్తుంది. ఈ పుస్తకం మాంసాహారం పౌష్టికమనే అపోహలను తొలగిస్తుంది. హిందూ మతంలో గోమాంస భక్షణ ఉండేదన్న అభాంఢాలను వందల కొలది వేద మంత్రాలతో, ధర్మ శ్లోకాలతో మరియు తిరుగులేని తర్క సూత్రాలతో ఇది తుడిచేస్తుంది.
ఈ పుస్తకం గోమాంసం తినొద్దనే వారికి అర్జీ కాదు. పైగా గోమాంసం తినేవారు ఈ పుస్తకం చదివాక మళ్ళి తినగలరా అని ఛాలెంజ్ చేసే పుస్తకం.
* ఈ పుస్తకం ఉక్కు గోడల్లాంటి కబేళా గదులు దాటి బయటకు రాలేని మూగ జీవాల గొంతుక.
* ఈ పుస్తకం ఆత్మను వెతికే వారి గుండే పిండేసే పుస్తకం.
* ఈ పుస్తకం జంతు ప్రేమికుల ఆయుధం.
* ఈ పుస్తకం గోమాతను ప్రేమించే వారి సమస్యల పరిష్కరిణి.
ఈ పుస్తకం చదివాక మీరు, మీ ప్రియమైన పిల్లలు, వారి పరివారం హాయిగా, ఆరోగ్యంగా, కలకాలం బతకాలంటే ఏమి చేయాలో తెలుస్తుంది. రక్తపు మరకల చరిత్రతో, మూగ జీవల ఆక్రందనలతో మరణానంతరం జీవితం మరియు మరు జన్మకి ఇలా వెళ్ళడం మంచిదా, కాదా అన్నది తెలుస్తుంది. మీరు మానవత్వాన్ని, కసాయితనం పై నిర్ణయాత్మకంగా, అధికారికంగా ఎలా గెలిపించగలరో తెలుస్తుంది.
- ఉక్కు చేతితో, తరుక్కు పోయే గుండె తో, ఓ గోమాత ప్రేమికుడు.
Note: PLEASE READ this Disclaimer for all Agniveer books on this store
Author : Sanjeev Newar
Pages : 119
Version : eBook - PDF
Size: 5.5" x 5.8"